Avatar2: మూడు రోజుల్లో అన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయా?

మరో 20 రోజులలో విడుదల కానున్న అవతార్2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అవతార్2 మూవీ టికెట్ రేట్లు భారీగానే ఉన్నా మూడు రోజుల్లో ఏకంగా 15 వేలకు పైగా అవతార్2 మూవీ ప్రీమియం టికెట్లు అమ్ముడయ్యాయి. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అవతార్2 మూవీ అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో థియేటర్లలో రిలీజవుతోంది. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. ప్రముఖ మల్టీప్లెక్స్ ల ఓనర్లు సైతం అవతార్2 మూవీ గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరూన్ సినిమాలకు ఆదరణ ఉంటుందని అన్నారు. మన దేశంలో ఆయన సినిమాలను చూసేవాళ్లు ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. అవతార్2 మూవీ కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు.

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని థియేటర్ల ఓనర్లు చెప్పుకొచ్చారు. సాధారణ బుకింగ్స్ మొదలైతే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నామని ప్రముఖ మల్టీప్లెక్స్ ల ఓనర్లు చెబుతున్నారు. అవతార్ సినిమాకు వచ్చిన స్పందనను మరవకముందే అవతార్2 సినిమా విడుదలవుతోందని వాళ్లు చెబుతున్నారు. మరి అంచనాలకు అనుగుణంగా అవతార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

అవతార్2 ఈ ఏడాది పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను సులువుగా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అవతార్2 నిజంగానే ఇప్పటివరకు క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. అవతార్2 హిట్ అనిపించుకోవాలంటే ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus