నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బింబిసార’ ట్రైలర్ .. గత నాలుగైదు రోజులుగా తెగ ట్రెండ్ అవుతుంది అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ట్రైలర్ లో విజువల్స్ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఈ ట్రైలర్ లోని డైలాగులు కూడా హైలెట్ గా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని చెప్పాలి.
‘పట్టుమని వంద మంది కూడా లేరు ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’ , ‘రాక్షసులు ఎరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి విశ్వరూపం’, ‘బింబిసారుడు అంటేనే మరణశాసనం… ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’ వంటి డైలాగులు మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డైలాగులు రాసిన వ్యక్తి ఎవరు? అని టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆసక్తి గా అతని గురించి గాలించడం మొదలుపెట్టారు.
‘బింబిసార’ కి ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ను రాసిన రైటర్ పేరు వాసుదేవ్ మునెప్పగారి. అతను గతంలో ఏ సినిమాకి పని చేసింది లేదు. ఇదే అతనికి మొదటి చిత్రం. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు. ఇతని వయసు కూడా కేవలం 28 సంవత్సరాలు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొదటి సినిమాకే ఓ పాతిక సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్న రైటర్ గా డైలాగులు రాసాడు అంటే అతని పెన్ పవర్ ఏంటి అన్నది స్పష్టమవుతుంది.
అందుకే అతని పేరు రోజు రోజుకి డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇలాంటి యంగ్ ట్యాలెంట్ ను ప్రోత్సహిస్తున్నందుకు హీరో కళ్యాణ్ రామ్ ను ప్రత్యేకంగా అభినందించాలి. ‘బింబిసార’ విజయం సాధిస్తే సినీ పరిశ్రమలో ఇతను అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!