స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకునేది. దాంతో మరో సౌందర్యగా ఈమె టాలీవుడ్లో చక్రం తిప్పుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో తమిళంలో ఆఫర్లు రావడంతో అటు వైపు మళ్లింది.
అక్కడ ‘అచ్చాముందు! అచ్చాముందు!’ అనే సినిమా చేస్తున్న టైములో నటుడు ప్రసన్నతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో అతన్ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న స్నేహ.. తన భర్తతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఇప్పటి వరకూ ఈ జంట ‘కంఫర్ట్ ఫాబ్రిక్’ ‘ఆశీర్వాద్’ ‘సన్ ఫీస్ట్ మ్యారి లైట్’ ‘విమ్’ ‘జి.ఆర్.టి జ్యుయలర్స్’ వంటి ఎన్నో యాడ్స్ లో నటించారు.
ఇక స్నేహ సెపరేట్ గా కూడా ‘వైభవ్ కలెక్షన్స్’ ఆశీర్వాద్ గులాబ్జామ్’ వంటి యాడ్స్ లో నటించింది. ఇలా వీళ్ళు యాడ్స్ రూపంలోనే ఇప్పటివరకూ రూ.2.87 కోట్ల వరకూ సంపాదించారని తెలుస్తుంది. వీళ్ళు నటించే యాడ్స్ కు కూడా డిమాండ్ ఉంటుందట. యాడ్స్ నిర్వాహకులను డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా యాడ్స్ ను కంప్లీట్ చేస్తుంటారట. ఇక సినిమాల్లో కూడా కీలక పాత్రలను పోషిస్తునే ఉంటారన్న సంగతి తెలిసిందే.