తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త లెక్కలను పరిచయం చేసిన సినిమా బాహుబలి : ది బిగినింగ్. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సష్టించిన ఈ అద్భుత కళాఖండం మనదేశం, పరదేశం అని తేడా లేకుండా అడుగుపెట్టిన చోటల్లా కలక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతోంది. ప్రభాస్ డ్యూయల్ రోల్ తో మెప్పిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు వసూలు చేస్తుందని డైరక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధం కాకముందే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బాహుబలి 2 ఉత్తరాంధ్రలోను కొత్త రికార్డులను నెలకొల్పుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏరియాలో బాహుబలి బిగినింగ్ 9 కోట్లు వసూలు చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు 8 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ 10 కోట్లు రాబట్టి ఉత్తరాంధ్ర సినీపరిశ్రమకు మరో బలమైన కేంద్రంగా ఎదుగుతోంది. అందుకే బాహుబలి 2 ఈ ఏరియాలో 20 కోట్లు తప్పకుండా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే అంతకంటే ఎక్కువగానే వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.