Bubble Gum Movie: ‘బబుల్ గమ్’ కి అదొక అడ్వాంటేజ్.. వర్కౌట్ అయితే..!

స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినిమా ప్రమోషన్ అయినా ఆమె చేతుల మీదుగా జరగాల్సిందే. అలాగే బుల్లితెర ప్రేక్షకులకి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సుమకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆమె సినిమాల్లో కూడా నటించారు. ఒకటి, రెండు తీసేస్తే మిగిలిన సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రలే చేసింది. కొంత గ్యాప్ తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ కూడా చేసింది.

ఎందుకో ఆ సినిమా కూడా ఆడలేదు. మొత్తంగా సుమ నటిగా క్లిక్ అవ్వలేదు. తన భర్త రాజీవ్ కనకాల మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా క్లిక్ అయ్యారు. దీంతో తన కొడుకు రోషన్ ను హీరోగా నిలబెట్టాలి అని సుమ నిశ్చయించుకున్నారు. ‘బబుల్ గమ్’ అనే చిత్రంతో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించిన

రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు.ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, సాంగ్స్.. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది (Bubble Gum) ఈ మూవీ. ఆ డేట్ కి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు.

ఇక డిసెంబర్ 31 , న్యూ ఇయర్ హాలిడేస్ తో లాంగ్ వీకెండ్ కలిసొచ్చి ‘బబుల్ గమ్’ కి మంచి ఓపెనింగ్స్ పడే అవకాశం ఉంది. ఆ రకంగా పాస్ మార్కులు వేయించుకునే ఛాన్స్ కూడా రోషన్ కనకాలకి ఉంది. చూడాలి మరి.. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus