Kalki Movie: ‘కల్కి 2898’ … అలాంటి కాంట్రోవర్సీల్లో చిక్కుకోదు కదా?

  • December 30, 2023 / 01:28 PM IST

పురాణాల్ని ఇష్టమొచ్చినట్టు మార్చి సినిమాలుగా తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ‘ఆదిపురుష్’ నిరూపించింది. ‘రామాయణం’ స్ఫూర్తితో రూపొందిన ఆ సినిమాలో… దర్శకుడు ఓం రౌత్ తనకు ఇష్టమొచ్చిన మార్పులు చేశాడు. రాముని కళ్ళముందే సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతున్నట్టు, రావణాసురుడి వాహనం గబ్బిలంగా పెట్టి, అలాగే పరమశివునికి భక్తుడైనటువంటి రావణాసురుడు పాములతో మసాజ్ చేయించుకుంటున్నట్లు.. ఇలా తనకు నచ్చినట్టు తీశాడు. అవి ‘హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి’ అంటూ కొన్ని చోట్ల కేసులు పెట్టి.. ఆ సినిమాని బ్యాన్ చేశారు.

ఫలితంగా కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. సో పురాణాలను సినిమాల్లో టచ్ చేస్తున్నప్పుడు దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ‘హను – మాన్’ అనే సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కువ టైం తీసుకుని రూపొందిస్తున్నాడు. సరే ఇక అసలు మేటర్ కి వచ్చేస్తే.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ‘కల్కి 2898 ‘ అనే సినిమా రూపొందుతుంది. దీని గ్లింప్స్ మొన్నామధ్య రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది అని అంతా అనుకున్నారు. కానీ దీని జోనర్ ఏంటి అన్నది తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ రివీల్ చేశాడు.పురాణాల్లోని కొన్ని పాత్ర‌ల్ని స్ఫూర్తిగా తీసుకొని..దానికి సైన్స్ జోడించి ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపాడు నాగ్ అశ్విన్. ‘అమితాబ్ పాత్ర అశ్వద్ధామని పోలి ఉంటుంది.. ప్రభాస్ పాత్ర ‘కల్కి’ ని పోలి ఉంటుంది’ అనే టాక్ చాలా రోజుల నుండి వినిపిస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. పురాణాల్ని వక్రీకరిస్తే (Kalki ) ‘కల్కి 2898 ‘ కూడా కాంట్రోవర్సీల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నాగ్ అశ్విన్ కూడా ఎంతో శ్రద్ధతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పాడు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే.. పురాణాల పై అతనికి మంచి పట్టు ఉంది. సో ‘ప్రాజెక్టు కె’ తో అతను ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు అని అతని టీం చెబుతుంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus