తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ఓవర్సీస్ కూడా మంచి కలక్షన్స్ తెచ్చే ప్రాంతంగా మారింది. స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే కాదు.. చిన్న హీరోల సినిమాలు సైతం అక్కడ సులువుగా వన్ మిలియన్ డాలర్లు సాధిస్తున్నాయి. రెండు మిలన్ మార్క్ దాటినా చిన్న చిత్రాలు సైతం ఉన్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి హక్కులను కొనుగోలు చేస్తున్నారు. అయితే “హ్యాపీ వెడ్డింగ్” మాత్రం అక్కడి వారిని ఆకర్షించలేదని తెలుస్తోంది. ఒక మనసు చిత్రం తర్వాత మెగా డాటర్ నిహారిక చేసిన సినిమా ఇది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది.
యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈనెల 28న థియేటర్లోకి రానుంది. అంటే రేపు అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. అక్కడ నుంచే రివ్యూలు మొదలయిపోతాయి. మంచి టాక్ వచ్చిందంటే ఇక్కడ తొలిరోజు కలక్షన్స్ అదిరిపోతుంది. అందుకే అక్కడి బిజినెస్ చూస్తే చిత్ర బృందానికి చమటలు పడుతున్నాయి. యుఎస్ మార్కెట్ లో ఆశించినంత స్పందన లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కి సాధారణంగా అక్కడ ప్రీ రిలీజ్ బజ్ బాగా ఉంటుంది. కానీ హీరో సుమంత్ అశ్విన్ ఇమేజ్ వీక్ గా ఉండటంతో పాటు హీరోయిన్ నీహారిక మెగా హీరోయిన్ అయినప్పటికీ ఆడియన్స్ ని రప్పించే శక్తిలేని కారణంగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కకపోవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారు. ఇక్కడ, అక్కడ.. ఎక్కడైనా సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాతే కలక్షన్స్ ఊపందుకునే అవకాశం ఉంది.