గత నెలలో విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ బ్యాచ్ ఈ సినిమాపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేసింది. అలానే పీఆర్ టీమ్ ఈ సినిమాకి మంచి హైప్ తీసుకురాగలిగారు. బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ పండితులంతా ఈ సినిమాను తెగ పొగిడేశారు. వసూళ్ల గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అన్నట్లే కథనాలను ప్రచురించారు.
కానీ బాలీవుడ్ సినిమాల వసూళ్లు బాగా పడిపోయిన పరిస్థితుల్లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని కూడా బాగా నిలబడింది. ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. చాలా రోజుల పాటు ఆ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగింది. కానీ పెట్టుబడి రాబడి కొనాలో చూస్తే మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత బయటకు వచ్చిన నెంబర్స్ చూస్తే ఆ విషయాన్ని కచ్చితంగా ఒప్పుకొని తీరాలి.
‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్, రూ.190 కోట్ల షేర్ రాబట్టింది. ఇండియా వరకు ఆ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.300 కోట్లకు దగ్గరగా వచ్చాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ బిజినెస్ రూ.600 కోట్ల వరకు జరిగింది. రూ.300 కోట్ల షేర్ వస్తే తప్ప అది బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి.
కానీ రికవరీ చూస్తుంటే 65 శాతం లోపే ఉంది. 35 శాతం.. అంటే రూ.100 కోట్లకు పైగానే ఈ సినిమా నష్టాలను తీసుకొచ్చింది. తెలుగులో తప్ప ఎక్కడా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నార్త్ లో అసలు బ్రేక్ ఈవెన్ మాటే ఎత్తలేని పరిస్థితి. అయితే ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మిన కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్ర2’ సినిమాను బయ్యర్లకు కాస్త రీజనబుల్ రేట్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది.