Jr NTR: ఆ విషయంలో యంగ్ టైగర్ మారతారా?

ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి ప్రయత్నించే నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు. తన సినీ కెరీర్ లో తారక్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు. ఆ పాత్రల కోసం తన లుక్ ను తారక్ మార్చుకున్నారు. ఒకప్పుడు లావుగా కనిపించిన తారక్ యమదొంగ సినిమా సమయంలో ఏకంగా 30 కిలోల బరువు తగ్గి అప్పటినుంచి పాత్రలకు తగినట్టు బరువు పెరగడం లేదా తగ్గడం చేస్తున్నారు.

అయితే ఈ స్టార్ హీరో సినిమా విడుదలై మూడేళ్లు గడిచిపోయింది. ఎన్టీఆర్ ఒకే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసిన సందర్భాలు సైతం గతంలో ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ కు పూర్తిగా పరిమితం కావడంతో తారక్ నటించిన సినిమా ఏదీ గత మూడేళ్లలో విడుదల కాలేదు. రాజమౌళి అనుమతితో చరణ్ ఆచార్యలో నటించగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటించే సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలై తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితమై కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకుళ్లలేదు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓకే చెప్పకుండా ఉండి ఉంటే గత మూడేళ్లలో కనీసం మూడు లేదా నాలుగు సినిమాలలో నటించి ఉండేవారని రెమ్యునరేషన్ రూపంలో 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలు దక్కేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ నాలుగేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆర్ఆర్ఆర్ తో దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే కొరటాల శివకు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కెరీర్ విషయంలో జాగ్రత్త పడాలని తర్వాత సినిమా పనులను వేగంగా మొదలుపెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మార్చి నెలలో ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus