వరుసబెట్టి మూడు బ్లాక్ బస్టర్స్ “శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం”లతో ఫుల్ ఫామ్ లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా “సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని” చిత్రాలతో వరుస ఫ్లాపులు వచ్చాయి. ఏ నిర్మాణ సంస్థకైనా ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ కి మాత్రం “అమర్ అక్బర్ ఆంటోని” చిత్రంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. “సవ్యసాచి”తో వచ్చిన నష్టాలకు మైత్రీవారు పెద్దగా భయపడలేదు కానీ.. “అమర్ అక్బర్ ఆంటోని” లెక్కలు మాత్రం వణుకు పుట్టీస్తోందట. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది పక్కన పెడితే.. కేవలం రవితేజకు రెమ్యూనరేషన్ రూపంలోనే 15 కోట్ల రూపాయలు ముట్టజెప్పారట.
శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, వచ్చిన అంతంతమాత్రం కలెక్షన్స్ ను లెక్కగాట్టినా రవితేజకు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో సగం కూడా వెనక్కి రావడం లేదు. కేవలం ఈ ఒక్క చిత్రంతోనే దాదాపు 25 కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూశారట మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ కి ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పెద్ద ఉండదు కానీ.. ఈమధ్యకాలంలో దర్శకనిర్మాతలకి ఈ రేంజ్ లో లాస్ తెచ్చిన సినిమా మాత్రం “అమర్ అక్బర్ ఆంటోని” అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.