స్టార్‌ హీరో సినిమాకి ఎంత కష్టం వచ్చిందో.. ఇలాగైతే ఎలా?

బాలీవుడ్‌ మరచిపోవాలి అనుకుంటున్న విషయాలు ఏమైనా ఉన్నాయా అంటూ లిస్ట్‌ మొదలుపెడితే అందులో కచ్చితంగా టాప్‌ ప్లేస్‌లో ఉండే విషయం 2022. అవును ఈ సంవత్సరమే. గత కొన్ని నెలలుగా బాలీవుడ్‌ పరిస్థితి చూస్తుంటే.. దరిద్రం అదృష్టం పట్టనట్లు పట్టేసింది అని చెప్పొచ్చు. ఏ సినిమా వచ్చినా డిజాస్టర్‌ అయ్యి కూర్చుంటోంది. చిన్న హీరోల సినిమాలు ఇలా అయితే ఏం చేస్తాం ఖర్మ అనుకుంటాం. కానీ అగ్ర హీరోలు, భారీ బడ్జెట్‌ల సినిమాలే తుస్‌ మంటున్నాయి.

అది కూడా మామూలు తుస్‌ కాదు… తుస్‌స్‌స్‌స్‌స్‌స్‌స్‌స్‌స్‌స్‌. తాజాగా ఈ పరిస్థితిని రణ్‌వీర్‌ సింగ్‌ సిఇనమా ఎదుర్కుంటోంది. రణ్‌వీర్‌ సింగ్‌, పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ప్రధాన పాత్రల్లో రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సర్కస్‌’. ఈ సినిమా గురించి మేం చెబుతున్నది. సుమారు రూ. 150 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఐదు రోజులకు పట్టుమని రూ.30 కోట్ల గ్రాస్‌ కూడా వసూలు చేయలేకపోయింది అంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

మొదటి రోజు, మొదటి షోకే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో కన్నీళ్లు తెప్పిస్తోంది. దీంతో బాలీవుడ్‌ బ్యాడ్‌ టైమ్‌ కంటిన్యూస్‌ అంటున్నారు పరిశీలకులు. టీమ్‌ ఎంతగా నిరాశపడిపోయింది అంటే ఇక ఈ సినిమా కోలుకోవడం అసంభవం ప్రచారం ఆపేసింది. రెండో వారం నుండి ఇవ్వాల్సిన ప్రమోషనల్ బడ్జెట్‌ను కూడా పూర్తిగా ఆపేసిందని టాక్‌. ఈ సినిమాతో రూ.200 కోట్లు వస్తాయని ఆశించిన యూనిట్‌.. ఇప్పుడు డీలాపడిపోయింది.

దీపికా పదుకోన్, అజయ్ దేవగణ్‌ లాంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయా అంటూ బాధపడుతున్నారు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌. దీంతో 2022 బాలీవుడ్‌కి బ్యాడ్‌ ఇయర్‌ అని తేల్చేయొచ్చు. కొన్ని సినిమాలు విజయాలు సాధించినా.. అవేవీ మిగిలిన సినిమాలకు కిక్‌ ఇవ్వలేదు. స్టార్‌ హీరోలు, కుర్ర హీరోలు ఇప్పుడు మరోసారి తమ సినిమాల గురించి ఆలోచించుకోవాలని ‘సర్కస్‌’ చెప్పకనే చెప్పింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus