Teja Sajja: హీరో తేజ సజ్జ సినిమాకి భారీ ఆఫర్!

రీసెంట్ గా విడుదలైన ‘హనుమాన్’ సినిమా టీజర్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. చిన్న టీజర్ తో సినిమాపై మంచి బజ్ ను తీసుకురాగలిగారు. టీజర్ లో విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇది. ఎప్పుడైతే టీజర్ సూపర్ హిట్ అయిందో.. అప్పుడే ‘హనుమాన్’ సినిమాకి బిజినెస్ సర్కిల్స్ లో డిమాండ్ పెరిగింది. ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ మొదలైంది.

జీ సంస్థ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ రేటు కోట్ చేసినట్లు సమాచారం. ఆ రెండు రైట్స్ రూపంలోనే ‘హనుమాన్’ బడ్జెట్ మొత్తం తిరిగి వచ్చేస్తుందని తెలుస్తోంది. అంటే ఇక థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేదంతా లాభాలనే చెప్పుకోవాలి. హిందీ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ ఏర్పడిందని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

అక్కడ కూడా భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘హనుమాన్’ సినిమాకి దాదాపుగా రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు బడ్జెట్ అయింది. కుర్ర హీరో తేజ సజ్జ మీద ఇంత బడ్జెట్ ఎలా పెట్టారా..? అని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ డబ్బు మొత్తం ఇప్పుడు కేవలం నాన్ థియేట్రికల్ రూపంలోనే వచ్చేస్తుంది. కాబట్టి ఎలా చూసినా.. ‘హనుమాన్’ సినిమాకి లాభాలు రావడం ఖాయం.

ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus