ప్రభాస్ మూవీకి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా చిత్రనిర్మాతలు ఆ ప్రచారం గురించి స్పందించడం లేదు. అయితే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కొరకు ఏకంగా 400 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

దాదాపుగా షూటింగ్ పూర్తైన ఈ సినిమాకు కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఈ నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్ సీన్స్ తెరకెక్కాల్సి ఉంది. గతంలో ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాధేశ్యామ్ సినిమాకు 300 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అమెజాన్ భారీ మొత్తం ఆఫర్ చేయడంతో నిర్మాతలు ఈ ఆఫర్ కు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

రాధేశ్యామ్ సినిమాకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైనట్లు తెలుస్తోంది. థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసినా కరోనా భయం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం లేదు. రాధేశ్యామ్ ఓటీటీలో రిలీజవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus