Prabhas: ‘రాధే శ్యామ్‌’ బంపర్‌ ప్లాన్స్‌ వేస్తున్నాడట!

రాజమౌళి సినిమాను చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. అంత భారీ స్థాయిలో, విజువల్‌ వండర్‌లా తెరకెక్కిస్తాడు. మరి రాజమౌళి తీసిన సినిమా ఢీకొట్టాలంటే… అంత ఈజీ కాదు. కథ, కథనం, దర్శకత్వానికి తోడు ఈసారి ఇద్దరు స్టార్‌ యంగ్‌ హీరోలు వస్తున్నారు కూడా. దీంతో ఆపోజిట్‌గా బరిలోకి దిగుతున్న సినిమాకు సంబంధించి ప్రచారం భారీ ఎత్తున చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆ హీరో పాన్‌ ఇండియా ఇమేజ్‌కి అవన్నీ చిన్న యాడ్‌ అన్స్‌ అని మరచిపోకూడదు.

ఇప్పటివరకు చెబుతున్నది ‘రాధే శ్యామ్‌’ సినిమా గురించే అని మీకు అర్థమైపోయుంటుంది. వచ్చే సంక్రాంతికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు పోటీగా ఓ వారం తర్వాత విడుదల కాబోతోంది ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’. ప్రభాస్‌కి ప్రస్తుతం ఉన్న ఫామ్, అతనికున్న ఫేమ్‌, పాన్‌ ఇండియా నేమ్‌కి భారీ స్థాయిలో ప్రచారం అక్కర్లేదు. అంతగా అన్ని వుడ్స్‌లో పాతుకుపోతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో. కానీ చిత్రబృందం ఏ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు అనుకుంటోందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం ఇంకా పూర్తి స్థాయిలో కిక్‌ స్టార్ట్‌ అవ్వలేదనే విషయం తెలిసిందే.

అడపాదడపా వీడియోలు రిలీజ్‌ చేస్తున్నారు అంతే. ఇక ‘రాధే శ్యామ్‌’కి అయితే పోస్టర్లతోనే సరిపెడుతూ వచ్చారు. ఇటీవల చిన్న టీజర్‌ బిట్‌ రిలీజ్‌ చేశారంతే. త్వరలో పూర్తిస్థాయి ప్రచారం స్టార్ట్‌ చేస్తారట. రాజమౌళి బ్రాండ్‌కి ఉన్న పేరు పవర్‌ ప్రభాస్‌ టీమ్‌కి తెలుసు. అందుకే ‘రాధే శ్యామ్‌’ను ఈ లోపు జనాల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారట. అన్నీ ఓకే అనుకుంటే ఈ నెల 10 నుండే ప్రచారం షురూ అంట.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus