Koratala Siva: కొరటాలకు టెన్షన్ పెరుగుతోందా.. కారణాలివేనా?

యంగ్ టైగర్ కొరటాల శివ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొరటాల శివపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై ఎనిమిది నెలలు కాగా ఈ సినిమాలో నటించిన చరణ్ వేగంగా ప్రాజెక్ట్ లలో నటిస్తుంటే తారక్ మాత్రం నిదానంగా సినిమాలలో నటిస్తుండటంపై ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. చరణ్ వేగంగా ప్రాజెక్ట్ లలో నటిస్తుండటంతో చాలామంది తారక్ ను ప్రశ్నిస్తున్నారు. తారక్ సైతం కొరటాల శివ వేగంగా సినిమా పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు తర్వాత సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలనే ఒత్తిడి కొరటాల శివపై ఉంది. 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా కెరీర్ ప్రమాదంలో పడుతోందని భావించి కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించారు. కొరటాల శివకు టెన్షన్ పెరుగుతున్నా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అటు కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ సన్నిహితులు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్న నేపథ్యంలో తారక్ సైతం ఈ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

తారక్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. తారక్ కు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ను ఏ హీరోయిన్ సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus