సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక పెద్ద సినిమాను థియేటర్లలో విడుదల చేయడం అంటే సులువైన విషయం కాదు. అయితే మైత్రీ నిర్మాతలు మాత్రం రిస్క్ తీసుకుని ఏకంగా సంక్రాంతి కానుకగా రెండు సినిమాలను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలను నైజాం ఏరియాలో దిల్ రాజుకు పోటీగా రిలీజ్ చేయడం కష్టమైన టాస్క్ కాగా మైత్రీ నిర్మాతలు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడి అనుకున్న విధంగా సినిమాలను రిలీజ్ చేశారు.
ఈ కష్టానికి ప్రతిఫలంగా మైత్రీ నిర్మాతలకు ఏకంగా పది కోట్ల రూపాయల స్థాయిలో లాభం వచ్చిందని సమాచారం అందుతోంది. దిల్ రాజుకు రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైత్రీ నిర్మాతలు ఇతర బ్యానర్లలో తెరకెక్కిన సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. తెలుగు సినిమాల కలెక్షన్లకు నైజాం ఏరియా కీలకం అనే సంగతి తెలిసిందే.
నైజాం ఏరియాలో సత్తా చాటాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించినా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు. మైత్రీ నిర్మాతల ఎంట్రీతో లెక్కలు మారుతున్నాయని తెలుస్తోంది. పండుగకు రెండు సినిమాలను విడుదల చేసి ఆ సినిమాలతో మైత్రీ సంస్థ సక్సెస్ లను అందుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ సంస్థ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.
మైత్రీ నిర్మాతలు కథల విషయంలో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ తో ముందడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుండి మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. మైత్రీ నిర్మాతలు కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ఈ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇతర భాషల్లో కూడా ఈ నిర్మాతలు సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?