సాహో సినిమాలో హీరోయిన్ ఎంత తీసుకుంటుందో తెలుసా ?
- August 18, 2017 / 08:50 AM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమ పరిధులను బాహుబలి పెంచింది. బడ్జెట్ నుంచి అన్ని విషయాల్లో కొత్త టార్గెట్ ని ఇచ్చింది. అందుకే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా బడ్జెట్ 150 నుంచి 200 కోట్లకు పెరిగింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నిర్మితమవుతున్న ఈ మూవీ టీమ్ లో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు ఆర్టిస్టులు ఉన్నారు. రీసెంట్ గా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ని తీసుకున్నారు. ఆమెకి రెమ్యునరేషన్ ఎంతో అనే సంగతి ఈ రోజు బయటికి వచ్చింది. 4 కోట్లు అందిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక హీరోయిన్ ఇన్నికోట్లు పారితోషికం అందుకున్న దాఖలాలు లేవు. బాహుబలి చిత్రాలకు అనుష్క రెండు కోట్లు తీసుకున్నదే ఇప్పటివరకు రికార్డ్ గా ఉంది. ఆ రికార్డ్ ని శ్రద్ధ చెరిపివేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో మొదలయింది. ఐదు కోట్లతో నిర్మించిన సెట్లో ప్రభాస్ పై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్వరలో శ్రద్ధ కపూర్ జాయిన్ అవుతారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















