‘ఆహా’ లో కూడా విశేషాదరణ దక్కించుకుంటున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’..!

ప్రతీవారం ఓ కొత్త చిత్రం లేదా ఒరిజినల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఆహా’ ఈ వారం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 3 నుండీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటీలో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మూవీ టాప్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో..

ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. మే 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. అయితే పెద్ద సినిమాల మధ్యలో ఈ చిత్రం నలిగిపోయింది. కానీ ‘ఆహా’ లో మాత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఉన్న సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి తన కులంలో సంబంధాలు దొరక్కపోవడంతో కులాంతర వివాహం చేసుకోవడానికి రెడీ అవుతాడు.

అలా ఆంధ్రా అమ్మాయి మాధవి (రుక్సార్ ధిల్లాన్)‌తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ కోసం బంధుమిత్రులతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తాడు. సరిగ్గా అదే టైంకి లాక్ డౌన్ ప్రకటించడంతో పెళ్లి వాళ్ళ ఇంట్లో లాక్ అయిపోతారు. పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న సమయంలో పెళ్లి కూతురు జంప్ అవుతుంది. మాధవి అర్జున్ కుమార్‌ని వదిలి ఎందుకు లేచిపోతుంది..

అసలు అర్జున్ పెళ్లి ఎవరితో జరుగుతుంది ? ఎప్పుడు అవుతుంది..అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ వీకెండ్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రమిది. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు .. ‘ఆహా’ లో చూడొచ్చు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus