రామోజీ ఫిలిం సిటీలో మొదలైన సాహో భారీ షెడ్యూల్

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక యాక్షన్ సినిమాలు వచ్చాయి. కానీ ఈసారి యాక్షన్ ఫిలిం పేరు చెప్పగానే సాహో పేరు గుర్తుకు వచ్చేలా యువ డైరక్టర్ సుజీత్ ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రభాస్ అత్యంత సాహోసోపేతమైన విన్యాసాలు చేస్తున్నారు. అబుదాబిలో భారీ యాక్షన్ సీన్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఇప్పుడు మరో యాక్షన్ సీన్ తీయడానికి సిద్ధమయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మార్కెట్‌ సెట్‌ లోనే ఈరోజు కొత్త షెడ్యూల్ మొదలయింది. ఈ షూటింగ్ లో శ్రద్ధాకపూర్‌ తో పాటు కొంతమంది నటీనటులు పాల్గొంటున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరగనుంది.

కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ సినిమా కి బ్రేక్ ఇచ్చి రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నారు. యువీ క్రియేషన్స్, కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభాస్ 20 వ సినిమా పనులు చకచకా సాగుతున్నాయి. నిన్న(సోమవారం) పూజా హెగ్డేకి ఫోటో షూట్ కూడా నిర్వహించారు. అలాగే 1970 నాటి కాలం కళ్ళకు కట్టేలా సెట్ వేస్తున్నారు. రంగస్థలం మాదిరిగా ఈ మూవీ కూడా సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus