ప్రభాస్, అనుష్కలపై రొమాంటిక్ పాట చిత్రీకరణలో రాజమౌళి

బాహుబలి బిగినింగ్ లో శివుడు(మహేంద్ర బాహుబలి), అవంతిక లపై వచ్చే “పచ్చ బొట్టేసిన” పాట యువతకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. ఈ గీతాన్ని చాలా అందంగా తెరకెక్కించి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడనిపించుకున్నారు. తమన్నా సినిమా మొత్తం డీ గ్లామర్ గా ఉన్నప్పటికీ ఈ పాటలో తన అందాలతో మత్తెక్కిచ్చింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ లో తమన్నాకు పాటలు లేకపోయినా, అందాలతో కనువిందు చేయడానికి అనుష్క ముస్తాబైంది.

దేవసేనగా పార్ట్ వన్ లో సింగిల్ కాస్ట్యూమ్ కే పరిమితమైన స్వీటీ, పార్ట్ 2 లో కుంతల రాజ్యానికి యువరాణిగా సాహసాలతో పాటు అమరేంద్ర బాహుబలికి ప్రియురాలిగా అలరించనుంది. ప్రస్తుతం జక్కన్న రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో అనుష్క, ప్రభాస్ లపై రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో స్వీటీ వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయని చిత్ర బృందం వెల్లడించింది. సోమవారం నుంచి జరుగుతున్నఈ చిత్రీకరణ మరో వారం పాటు సాగవచ్చని వివరించింది. ఎక్కడా హడావుడి పడకుండా రాజమౌళి ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లా తీస్తున్నారని యూనిట్ సభ్యులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus