‘ప్రభాస్ 20’ కి అప్పుడే 50 కోట్ల ఖర్చంట..!

‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలోనే తరువాతి సినిమా విషయంలో.. ‘ఇక చెప్పకూడదు చేసి చూపించెయ్యాలి’ అంటూ ప్రభాస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పడంతో తన 20వ సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తాడేమో అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘సాహో’ కలెక్షన్ల విషయంలో పర్వాలేదనిపించినా.. పూర్తిస్థాయిలో అయితే అభిమానుల్ని అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు తన 20 వ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని కీలక మార్పులు కూడా చేయిస్తున్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. రామోజీ ఫిలింసిటీ లో 1980 కాలం నాటి యూరప్ సెట్ ను వేస్తున్నారట. 25 భారీ సెట్లు వేసి కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా 50 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారట. అయితే అప్పుడే 50 కోట్ల ఖర్చంటే.. సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత ఖర్చవుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు కొంతమంది అయితే.. ఇది కూడా ‘సాహో’ లానే భారీ బడ్జెట్ చిత్రం అయిపోతుందనేది మరికొంత అభిప్రాయం. ఇదిలా ఉంటే.. 10 సార్లు, 20 సార్లు యూరోప్ కు వెళ్ళడం.. అది కూడా టెక్నిషియన్లని, జూ.ఆర్టిస్ట్ లను తీసుకెళ్ళడం.. ఇంకా ఎక్కువ ఖర్చవుతుందని భావించి ఇలా చేస్తున్నారేమో అన్నది కూడా కొందరి అభిప్రాయం. మరి ఈ చిత్రం ఎప్పటికి పూర్తి చేసి విడుదల చేస్తారో చూడాలి..!


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus