టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బన్నీకి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని సంపాదించుకున్న బన్నీ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పుష్ప ది రైజ్ సినిమా కోసం బన్నీ ఏ స్థాయిలో కష్టపడ్డారో పుష్ప ది రూల్ కోసం బన్నీ అంతకు మించి కష్టపడుతున్నారు. తన కుటుంబ సభ్యులకు ఏ కష్టం రాకుండా బన్నీ చూసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే బన్నీ రికార్డ్ స్థాయిలో ఫాలోవర్లతో సత్తా చాటుతున్నారు. మలయాళం ప్రేక్షకులు బన్నీని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. తాజాగా బన్నీ తన మామకు బెనిఫిట్ కలగాలని నల్గొండలో కొత్తగా కట్టిన కన్వెన్షన్ ప్లేస్ ఓపెనింగ్ కు వెళ్లారు. బన్నీ హాజరు కావడం వల్ల భారీ స్థాయిలో అభిమానులు రావడంతో బన్నీ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కేసీఆర్ నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయమని చెబితే పోటీ చేస్తానని ప్రకటన చేశారు.
అయితే సీఎం కేసీఆర్ తాజాగా బీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే నేతల జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో నాగార్జున సాగర్ నుంచి నోముల భగత్ పోటీ చేస్తారని అధికారికంగా క్లారిటీ వచ్చింది. బన్నీ మామకు అధికార పార్టీ మొండి చెయ్యి చూపిందని క్లారిటీ వచ్చేసింది. రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని భావిస్తున్న బన్నీ మామ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా బన్నీ (Allu Arjun) మద్దతు కచ్చితంగా ఉంటుందని ఆయన గెలవడానికి అవసరమైన సహాయ సహకారాలను బన్నీ అందిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ జాబితాలో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తుండగా ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తారో చూడాలి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్