Anasuya: ఆ ప్రశ్నలకు అనసూయ దగ్గర సమాధానం ఉందా?

  • July 25, 2022 / 07:59 AM IST

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ గా అనసూయకు పేరుంది. కొన్ని వారాల క్రితం అనసూయ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పానని పరోక్షంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానెల్ నుంచి భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్ రావడంతో అనసూయ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అనసూయ హాజరైన చివరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ప్రోమోలో చలాకీ చంటి పెళ్లి కొడుకు గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అనసూయ ఫోటోలు తీస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. పాపం ఆ అమ్మాయిని ఒక ఫోటో తియ్యనియ్యి అసలే ఈరోజు లాస్ట్ కదా అంటూ అనసూయపై చంటి సెటైర్లు వేశారు. ఆ తర్వాత తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి నాకు జబర్దస్త్ చేయడం కుదరట్లేదు సార్ అని చెప్పడంతో పాటు నేను జబర్దస్త్ మానేయాలని అనుకుంటున్నానని చెప్పగా షోలో ఉన్న జబర్దస్త్ కమెడియన్లు, ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాగుబోతు రమేష్ జబర్దస్త్ అనేది పర్మినెంట్ అని ఇక్కడికి చాలామంది వస్తుంటారు పోతుంటారు అని జబర్దస్త్ మాత్రం స్టిల్ రన్నింగ్ అని అనసూయ చెప్పినట్టు చెప్పారు. ఆ తర్వాత చలాకీ చంటి నెలలో మూడు రోజులు మాకోసం అడ్జస్ట్ చేయలేవా అని అడగగా అనసూయ ఏమని సమాధానం ఇచ్చిందో ప్రోమోలో చూపించలేదు. ఇంద్రజ బాధ పడుతూ జబర్దస్త్ స్టేజ్ కచ్చితంగా అనసూయను మిస్ అవుతుందని వెల్లడించారు.

రాకెట్ రాఘవ మాట్లాడుతూ జబర్దస్త్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని ఇస్తుందని చెప్పుకొచ్చారు. కొత్తకొత్త కామెడీతో కొత్తకొత్త ఆర్టిస్ట్ లతో జబర్దస్త్ కళకళలాడుతుందని రాఘవ కామెంట్లు చేశారు. జబర్దస్త్ షోకు వచ్చే కొత్త యాంకర్ ఎవరో చూడాల్సి ఉంది. ఈ ప్రోమోకు రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అనసూయను మిస్ అవుతున్నామని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus