మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కిన మూవీ ‘భోళా శంకర్. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.కే.ఎస్.రామారావు సమర్పకులుగా వ్యవహరించారు. 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సినిమా ఔట్పుట్ తో టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉంది.
కానీ ఈ సినిమా పై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. మెహర్ రమేష్ గత చిత్రాలు నిరాశపరచడం.. దీంతో పదేళ్ల పాటు ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం ఒక కారణమైతే.. టీజర్, పాటలు, సో సో గా ఉండటం అనేవి ఇందుకు ఇంకా కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ట్రైలర్ కొంత రిలీఫ్ ఇచ్చింది.మెగా అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాయి.అందుకే టీమ్ ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంది.
వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా హైక్స్ కోసం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. అయితే భోళా శంకర్ టీమ్ కి వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు.రిక్వెస్ట్ సరైన విధంగా పెట్టుకోలేదు అని, అందుకు అవసరమైన పేపర్స్ సబ్మిట్ చేయలేదు అంటూ తిరస్కరించింది. ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి వైసిపి నాయకులు గురించి చేసిన వ్యాఖ్యల వల్ల …(Bhola Shankar) భోళా శంకర్ కి టికెట్ రేట్లు పెంచలేదు అని స్పష్టమవుతుంది.