థర్టీ ఇయర్స్ పృథ్వీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పృథ్వీ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. వైసీపీలో చేరిన పృథ్వీ ఆ పార్టీ ద్వారా పదవిని పొంది కొన్ని కారణాల వల్ల ఆ పదవిని కోల్పోయారు. అయితే థర్టీ ఇయర్స్ పృథ్వీకి తాజాగా కోర్టులో భారీ షాక్ తగిలింది. 2017 సంవత్సరం జనవరి నుంచి ప్రతి నెలా 8 లక్షల రూపాయల చొప్పున భార్యకు భరణంగా పృథ్వీ చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించగా కోర్టులో శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2017 సంవత్సరం జనవరిలో శ్రీలక్ష్మి కోర్టులో కేసు వేశారు. పృథ్వీ కోసం తన తల్లీదండ్రులు ఎంతో ఖర్చు చేశారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. పృథ్వీ తనను ఇంటినుంచి బయటకు పంపించాడని ప్రస్తుతం తాను తల్లీదండ్రులతో ఉంటున్నానని ఆమె పిటిషన్ లో వెల్లడించారు. పృథ్వీ నెల సంపాదన 30 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తనకు తగిన భరణం ఇప్పించాలని ఆమె కోర్టును కోరగా నెలకు 8 లక్షల రూపాయల భరణం చెల్లించాలని కోర్టు పృథ్వీని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల గురించి పృథ్వీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పృథ్వీ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పృథ్వీ అరియర్స్ చెల్లించాలంటే ఏకంగా ఆరు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పృథ్వీ అంత మొత్తం డబ్బును చెల్లించడం అంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.
పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్నారని తెలుస్తోంది. వైసీపీలో స్థానం లేకపోవడంతో పృథ్వీ జనసేనపై దృష్టి పెట్టారు. పృథ్వీ రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!