బాహుబలి బిగినింగ్ తెలుగు చిత్రాల రికార్డులన్నిటినీ తుడిచి వేసింది. ఆ రికార్డులను అధిగమించడానికి బాహుబలి కంక్లూజన్ సిద్ధంగా ఉంది. రాజమౌళి, ప్రభాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను గతవారం విడుదలయిన ట్రైలర్ మరింత పెంచేసింది. అయితే బాహుబలి 2 ఎదుట భారీ లక్ష్యం ఉంది. అమెరికాలో 15 మిలియన్ డాలర్లకు మించి వసూలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మన తెలుగు చిత్రాలు అమెరికాలో ఓక్ మిలియన్ డాలర్లు దాటితేనే సంబర పడిపోతుంటారు. రెండు మిలియన్ దాటితే ఆనందానికి హద్దులు ఉండదు.
ఇక 15 మిలియన్ డాలర్ అనేది పెద్ద లక్ష్యమే కదా..!. బాహుబలి మొదటి పార్టీ మూడు భాషల్లో కలుపుకొని ఆరు మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇప్పటి వరకు దంగల్ 12 మిలియన్ డాలర్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలబడి ఉంది. ఆ చిత్రానికంటే అధికంగా బాహుబలి 2 వసూలు రాబట్టాలి. ఎందుకు అంత పెద్ద టార్గెట్ అంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు బాహుబలి కంక్లూజన్ నాలుగు భాషల థియేటర్ రైట్స్ ని కొనుగోలు చేశారు. వారు లాభాలు చూడాలంటే కనీసం 50 కోట్లు వసూలు చేయాలిగా. అన్నికోట్లు వసూళ్లు చేస్తుందా? లేదా? అనే విషయం మరో నెల రోజుల్లో తెలిసిపోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.