నాగబాబు తనయుడిగా ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి పరచయమయ్యారు వరుణ్ తేజ్. ఒక్కొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ.. నటనలో తనను తాను ప్రూఫ్ చేసుకుంటూ మెగా ప్రిన్స్ గా ఎదిగారు వరుణ్ తేజ్. మరో ఐదు రోజుల్లో తను నటించిన కొత్త సినిమా గాండీవధారి అర్జున విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వరుణ్ తేజ్ కు జంటగా సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.
మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ వంటి వారు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.చిత్ర యూనిట్ ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి. ఇటీవలే చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ బోర్డు సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఎలాగైనా కొట్టి తీరాలని వరుణ్ తేజ్ కసి మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదే ఈ సినిమా బడ్జెట్. గాండీవధారి అర్జున కోసం ఏకంగా రూ. 55 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ సినిమాకు చెందిన మేజర్ షూటింగ్ విదేశాల్లోనే జరిగిందట. దీంతో సినిమాకు ముందు ఊహించిన బడ్జెట్ కంటే ఎక్కువ అయిందట. వరుణ్ తేజ్ కెరీర్లోనే గాండీవధారి అర్జున హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పుకోవాలి.
అయితే ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బడ్జెట్ లో రూ 26 కోట్లు వచ్చేశాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ రూ. 30 కోట్లు చేయాల్సి ఉంది. వరుణ్ కు ఇది భారీ టార్గెట్ అనే చెప్పుకోవాలి. సో సో హీరోగా ఉన్న వరుణ్ ముప్పై కోట్లు రాబట్టాలంటే సినిమాకు భారీ హిట్ టాక్ వస్తే కానీ సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి సినిమా (Gaandeevadhari Arjuna) విడుదలైతే కానీ నిర్మాతలు నమ్మి పెట్టిన డబ్బులు వస్తాయేమో !
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్