Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ముందు భారీ టార్గెట్.. కానీ?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండగా చిరంజీవి నటిస్తున్న సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి రేంజ్ కు తగిన హిట్ సాధించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వాల్తేరు వీరయ్య సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వాల్తేరు వీరయ్య రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా కొన్ని రోజుల గ్యాప్ తో ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. అయితే వాల్తేరు వీరయ్య మూవీ థియేట్రికల్ హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా సాధించే కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో ఉండాలి. వాల్తేరు వీరయ్యపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య కలెక్షన్లు రికార్డులు బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో శృతి హాసన్ కు కూడా ఈ సినిమా ప్రమోషన్ల భారం పడనుందని తెలుస్తోంది.

శృతి హాసన్ ఈ సినిమాల రిజల్ట్ విషయంలో సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చిరంజీవి, బాలయ్య తమ సినిమాలతో కొత్త టార్గెట్లను సెట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి పండుగకు మూడు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండనుందని తెలుస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus