సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీకాంత్, భరత్ వంటి పేరున్న నటీనటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
దీంతో బిజినెస్ కూడా ఓ మాదిరిగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.80 cr |
సీడెడ్ | 1.00 cr |
ఉత్తరాంధ్ర | 1.20 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.30 cr |
కృష్ణా | 0.29 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.90 cr (షేర్) |
‘హంట్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.సుధీర్ బాబు గత చిత్రాలు ఈ టార్గెట్ కు తగ్గ కలెక్షన్లను అయితే రాబట్టలేకపోయాయి.’హంట్’ మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూద్దాం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?