Prabhas car: రూల్స్ బ్రేక్ చేసిన ప్రభాస్.. ఫైన్ విధించిన పోలీసులు!

ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా.. సెలబ్రిటీల తీరు మాత్రం మారడం లేదు. ట్రాఫిక్స్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ.. ఫైన్ల మీద ఫైన్స్ కడుతున్నారు. తాజాగా సినీ నటుడు ప్రభాస్ కారుకి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శనివారం నాడు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ జంక్షన్ వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపారు. ఆ కారుని చెక్ చేయగా నటుడు ప్రభాస్ కార్ అని తెలిసింది.

Click Here To Watch NOW

నంబర్ ప్లేట్‌ సరిగ్గా లేకపోవడం, కారుపై ఎంపీ స్టిక్కర్, విండోలకు బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండడంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 ఫైన్ వేశారు. అయితే పోలీసులు జరిమానా విధించినప్పుడు ప్రభాస్ కారులో లేరని తెలుస్తోంది. అతడి డ్రైవర్ మాత్రమే ఉన్నారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్‌, ప్రజా ప్రతినిధుల పేరుతో సిక్కర్లు అంటించి వాటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొద్దిరోజులుగా నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తుస్తున్నారు.

ఈ తనిఖీల్లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు ఫైన్ విధించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర ఎన్టీఆర్ కారుని ఆపిన పోలీసులు.. బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో దాన్ని తొలగించి ఫైన్ వేశారు. అలానే టోలీచౌకి వద్ద న‌టుడు మంచు మ‌నోజ్ కారును ఆపిన పోలీసులు.. టింటెడ్ గ్లాస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.700 జరిమానా విధించారు. దర్శకుడు త్రివిక్రమ్ కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో.. వాటిని తొలగించి రూ.700 ఫైన్ వేశారు.

తన కారుని చెక్ చేసినప్పుడు త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. టింటెడ్ గ్లాస్ వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. వాహనం విండో పూర్తిగా ట్రాన్స్పెరెంట్ ఉండాలని పేర్కొంది. అయితే కొందరు సెలబ్రిటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్ ను ఉపయోగిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus