కరోనాతో ఇబ్బంది పడుతోన్న వ్యక్తికి మందులు ఇవ్వడానికి వెళ్తున్న తనను పోలీసులు అడ్డగించడంపై హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయమేమిటంటే.. కరోనా సెకండ్ వేవ్ ను కంట్రోల్ చేయడానికి తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భామగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల్లోపు మాత్రం ప్రజలు బయటకొచ్చి తమ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత అనవసరంగా ఎవరైనా బయటకొస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
అయితే అత్యవసరాలకు మాత్రం ఇది మినహాయింపు ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ అత్యవసరమని చెప్పినా హీరో నిఖిల్ ను పోలీసులు అడ్డుకోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పోలీస్ వ్యవస్థను విమర్శిస్తున్నారు. కోవిడ్ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు ఇవ్వడానికి ఉప్పల్ నుండి కిమ్స్ మినిస్టర్స్ రోడ్ లో ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు తన కారుని ఆపేశారని.. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ఈపాస్ ఉండాల్సిందేనని చెప్పడంతో తొమ్మిదిసార్లు ప్రయత్నించానని.. కానీ సర్వర్ డౌన్ అయిందని..
వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి తానొచ్చినట్లు నిఖిల్ వివరంగా ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులపై తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఈ ఇష్యూపై హైదరాబాద్ సిటీ విభాగం స్పందించింది. ‘డియర్ సర్.. మీ లొకేషన్ ఒక్కసారి మాకు పంపించండి.. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తామంటూ’ పోలీస్ విభాగం స్పందించింది. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యులు అత్యవసర పరిస్థితుల్లో బయటకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!