‘అల వైకుంఠపురములో’ సీన్ ను వైరల్ చేస్తున్న పోలీసులు..!

పూజా హెగ్డే.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోంది ఈ బుట్టబొమ్మ. ఇప్పుడు టాలీవుడ్లో తెరకెక్కే పెద్ద పెద్ద సినిమాలకు ఈమెనే ఫస్ట్ ఛాయిస్. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా ఈ బ్యూటీనే. ఇప్పటికే అల్లు అర్జున్,ఎన్టీఆర్‌తో,మహేష్‌ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి క్రేజీ చిత్రాల్లో ఈమె నటిస్తుంది.2021 లో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఇక పూజా హెగ్డే కు కేవలం యూత్ లోనే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ అలాగే కిడ్స్ లో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈమె క్రేజ్ ను మన హైదరాబాద్ పోలీసులు కూడా ఓ మంచి పని కోసం ఉపయోగించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి ఓ బిజినెస్ డీల్ కోసం బ్రహ్మాజీని కలవడానికి వెళ్తారు. ఈ క్రమంలో పూజా హెగ్డే బిజినెస్‌ను తనకు రాసిచ్చెయ్యమని డిమాండ్ చేస్తుంటాడు. దానికి పూజా ఒప్పుకోకపోవడంతో బ్రహ్మాజీ వార్ణింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు.

ఈ సమయంలో హీరో అల్లు అర్జున్.. ఆమెకు అండగా నిలబడి.. ‘అమ్మాయిలు ఏదైనా విషయంలో నో అన్నారంటే.. దాని అర్థం ఇష్టం లేదు అని .. మరొకటి కాదని’ చెబుతాడు. ఇదే సీన్ ను మన పోలీసులు కట్ చేసి వాడుకోవడం విశేషం. ‘మహిళలు ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్‌తో లేదా భర్తతో.. వాళ్ళు ప్రతికూల పరిస్థుతుల్లో ఉన్నప్పుడు కోరిక తీర్చడానికి నో చెబితే.. వాళ్ళ నిస్సహాయ స్థితిని కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించడం మగతనం కాదని’ అర్థం వచ్చేలా కామెంట్ పెట్టారు. అంతేకాదు ‘రెస్పెక్ట్ ఉమెన్’ ‘స్టాప్ క్రైమ్స్ ఎగైనెస్ట్ ఉమెన్’ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జతచేశారు.


Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus