యువ హీరో నిఖిల్ సిద్ధార్థ గత నెల లాక్ డౌన్ సమయంలో పోలీసుల వలన కొంత సేపు రోడ్డుపైన వేచి ఉండాల్సి వచ్చింది. మెడిసిన్ చేరవేయడం కోసం అర్జెంట్ గా బయటకు రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతసేపటికి వరకు ఎవరు అతన్ని వదల్లేదు. ఇక ట్విట్టర్ ద్వారా ఉన్నతాధికారులను ట్యాగ్ చేయడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకొని వదిలిపెట్టారు. ఇక రీసెంట్ గా ఈ హీరోకు మరొక చేదు అనుభవం ఎదురైంది.
ఈ నెల 9 వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే నిఖిల్ సిద్ధార్థ్ రేంజ్ రోవర్ కారుకు లాక్ డౌన్ సమయంలో బయటకు రావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నెంబర్ ప్లేట్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని మరొక చలాన్ విధించారు. అయితే రెండు చాలన్లు విధించిన సమయంలో నిఖిల్ కారులో లేనట్లు తెలుస్తోంది.
ఇక కరోనా కేసులను తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరు అధిగమించినా కూడా చర్యలు తప్పవని ఇదివరకే ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇక నిఖీల్ లాక్ డౌన్ సమయంలో చాలామంది పేద వారికి మెడికల్ సహాయం చేశాడు. మరికొందరికి ఆర్ధికంగా కూడా హెల్ప్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు సహాయం అడిగినా కూడా ఆధారాలు సేకరించి సరైన సమయంలో సహాయం చేశాడు. ఇక నెక్స్ట్ఈ హీరో 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!