Ravi Teja: రవితేజ సినిమాలో హైపర్ ఆది హ్యాండ్..!

టాలీవుడ్ హీరో రవితేజ ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కీలకపోయింది. రిలీజ్ కు ముందు సినిమాపై మంచి బజ్ ఏర్పడినప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో చాలా సినిమాలున్నాయి. కొన్ని రోజుల్లో ఆయన నటించిన ‘ధమాకా’ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుందట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ‘జబర్దస్త్’ స్కిట్స్ లాంటి కామెడీ ట్రాక్ లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా దర్శకుడు త్రినాథరావు.. హైపర్ ఆది మంచి స్నేహితులు. ‘జబర్దస్త్’ షోలో హైపర్ ఆది స్కిట్స్ ఏ రేంజ్ లో పేలుతాయో తెలిసిందే. అందుకే త్రినాథరావు.. ఆదితో తన సినిమా కోసం కొన్ని స్కిట్స్ రాయించుకున్నారట. సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్కిట్స్ కనిపిస్తాయని అంటున్నారు.

అయితే ‘జబర్దస్త్’ షోని ఎంత మంది ఇష్టపడతారో అదే రేంజ్ లో హేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. బుల్లితెరపై ఆ షో ఓకే కానీ.. అలాంటి స్కిట్స్ ను వెండితెరపై పాపులర్ హీరోలు వేస్తే బాగోదేమో. అయితే ఈ విషయంలో హీరో రవితేజ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని టాక్. దర్శకుడు చెప్పినట్లుగా సినిమా చేసుకుంటూ వెళ్లిపోయారట. ఈ మధ్యకాలంలో రవితేజ జడ్జిమెంట్ చాలా వరకు ఫెయిల్ అవుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదని.. దర్శకుడికే మొత్తం వదిలేశారని తెలుస్తోంది. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus