Hyper Aadi: ఆది పెళ్లి ఫోటో వైరల్… అసలు మేటర్ ఏంటి?

హైపర్ ఆది.. అందరికీ సుపరిచితమే. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్స్ లో ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ షోలో ఓ రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది ఆ తర్వాత తన పెన్ పవర్ తో టీం లీడర్ అయిపోయాడు. అప్పటివరకు సుడిగాలి సుధీర్, గెటప్ శీను ల స్కిట్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఆది ఎంటర్ అయ్యాక అతని స్కిట్ ల గురించి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టాడు.యూట్యూబ్ లో ఇతని స్కిట్ లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.

బుల్లితెర పై మాత్రమే కాదు వెండితెరపై కూడా బిజీ కమెడియన్ అయిపోయాడు ఆది. తర్వాత ‘ఢీ’ లో కూడా కొన్ని రోజులు సందడి చేశాడు. ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో కూడా పాల్గొంటున్నాడు. ‘సుడిగాలి’ సుధీర్ ఈ మధ్య బుల్లితెరకు దూరమయ్యాడు కాబట్టి.. ఆదినే ఇక్కడ తిరుగులేని స్టార్ గా రాణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇదిలా ఉంటే.. హైపర్ ఆది పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సుధీర్, ప్రదీప్ వంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నాకే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని ఇది వరకే చెప్పాడు. అయితే ఆది సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. కాసేపటికే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇది షూటింగ్ లో భాగంగానే జరిగిందని.. ఆది పక్కనున్న అమ్మాయి సీరియల్ నటి అని స్పష్టమవుతుంది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus