Hyper Aadi: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన దొరబాబు.. ఏంటంటే?

బుల్లితెరపై హైపర్ ఆది ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్ అనే సంగతి తెలిసిందే. హైపర్ ఆది వేసే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల్లో చాలామంది ఫిదా అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో హైపర్ ఆది వీడియోలు రికార్డు స్థాయిలో వ్యూస్ ను అందుకుంటున్నాయి. హైపర్ ఆది స్కిట్ల ద్వారా దొరబాబు, పరదేశి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే తాజాగా దొరబాబు కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఏపీలోని వైజాగ్ కు చెందిన దొరబాబు పలు సినిమాల్లో నటుడిగా కూడా నటించారు.

ఆది టీంలో చేరిన తర్వాత దొరబాబుకు భారీ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. దొరబాబు అమూల్య అనే టీవీ యాంకర్ ను వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడటంతో నెటిజన్లు వీళ్లిద్దరినీ తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. హైపర్ ఆది సైతం స్కిట్లలో వీళ్లిద్దరి గురించి పంచ్ లు వేయడం గమనార్హం. మైత్రీవనంకు సమీపంలో శ్రీనిక పేరుతో దొరబాబు టిఫిన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ టిఫిన్ సెంటర్ కు హైపర్ ఆది, జబర్దస్త్ కమెడియన్లు ప్రచారం చేశారు.

ఏపీ, తెలంగాణ వంటకాలను సరసమైన ధరలకు ఈ హోటల్ ద్వారా అందించనున్నట్టు కమెడియన్లు వెల్లడించారు. జబర్దస్త్ కమెడియన్ గా సక్సెస్ సాధించిన దొరబాబు వ్యాపారంలో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. జబర్దస్త్ కమెడియన్ల ప్రచారంతో ఈ హోటల్ లోని వంటకాలను తినడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus