Hyper Aadi: ఆ ట్రోల్స్ అన్ని ఆశీర్వాదాలుగా మారుతాయి: హైపర్ ఆది

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు వెండితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపుపొందిన ఆది తాజాగా ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు అయితే ప్రస్తుతం ఈయన చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 వతేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి జాం జాం జజ్జనక అనే సంగీత్సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఈ సినిమాలో ఈ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు ఈ సాంగ్ షూటింగ్ సమయంలోనే తన బర్త్ డే కూడా జరిగిందని,చిరంజీవి గారికి సమక్షంలో నా పుట్టినరోజు జరుపుకునే అవకాశం అలా వచ్చిందని ఈయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి కూడా ఆది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెహర్ రమేష్ అంటే ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి శక్తి, షాడో వంటి ఫ్లాప్ సినిమాలనే అందరూ గుర్తిస్తారు కానీ ఆయన హిట్ సినిమాలను గుర్తించరని తెలిపారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ను చాలా స్టైలిష్ గా చూపించిన చిత్రం బిల్లా ఆ సినిమాకు డైరెక్టర్ మెహర్ రమేష్ అని తెలిపారు.

ఇలా ఈయన కెరియర్ లో హిట్ సినిమాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇక ఫెయిల్యూర్స్ వల్ల ట్రోల్స్ వస్తాయి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆది తెలిపారు. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఎవరూ లేరు. దేనికైనా టైం రావాలని తెలిపారు. ఇలా మెహర్ రమేష్ గురించి వచ్చిన ట్రోల్స్ అన్నీ కూడా భోళా శంకర్ సినిమాకు ఆశీర్వాదాలు మారీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఈ సందర్భంగా ఆది చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus