Hyper Aadi, Siri: షణ్ముఖ ప్రస్తావన తెస్తూ సిరిని అవమానపరిచిన ఆది.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ఆది గురించి చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఏదైనా పండుగలు వస్తే ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించడంలో మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోనే నవరాత్రులు రావడంతో నవరాత్రి ధమాకా అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్,పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఎప్పటిలాగే తనదైన శైలిలో అందరిపై పంచ్ లు వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5ఎంతో ఫేమస్ అయినటువంటి సిరి గురించి పరిచయం అవసరం లేదు.ఈమె బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన హంగామా అందరికీ తెలిసిందే.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో నెగిటివిటీ మూట కట్టుకుంది. అయితే నవరాత్రి ధమాకా కార్యక్రమంలో భాగంగా సిరి నాకు ఇక్కడ బోర్ కొడుతుంది అంటూ కామెంట్ చేయగా వెంటనే హైపర్ ఆది రెండు రోజులకే బోర్ కొడితే బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఎలా ఉన్నావమ్మా అంటూ కామెంట్ చేశారు. తాను బిగ్ బాస్ హౌస్ లో అందరికీ ఫన్ ఇచ్చాను కదా అంటూ సిరి చెప్పగా.. నువ్వు ఫన్ మొత్తం షన్నుకే ఇచ్చావు మాకు ఎక్కడ ఇచ్చావు అంటూ అందరి ముందు సిరిని దారుణంగా అవమానించారు.

ఇలా సిరిని షణ్ముఖ్ పేరు ప్రస్తావిస్తూ అవమానించడంతో నేటిజన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జరిగిపోయిన చేదు అనుభవాలను గుర్తు చేయడం అవసరమా.. నువ్వు ఎప్పటికీ మారవు అంటూ పెద్ద ఎత్తున ఆదిపై ట్రోల్ చేస్తున్నారు. అయినా హైపర్ ఆదికి ఇలాంటి ట్రోల్స్ కొత్తేమీ కాదని చెప్పాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus