హుషారైన కుర్రోడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకు కూడా అతనంటే ఇష్టమే. కానీ తండ్రిని ఒప్పిస్తే తలవంచి తాళి కట్టించుకుంటాని చెప్పింది హీరోయిన్. మొదట్లో ఫోజులు కొట్టిన హీరో .. తర్వాత మామయ్య ను ఒప్పించడానికి వెళుతాడు.. తన ప్రవర్తన వల్ల చిక్కుల్లో చిక్కుకుంటాడు. చివరికి మనసుపడిన అమ్మయినా మనువు చేసుకున్నాడా ? లేదా? అనే కథతో యువచంద్ర అనే యువహీరో, దర్శకుడు చేసిన పెద్ద ప్రయత్నమే “ఐ యామ్ బచ్చన్”.
కమర్షియల్ సినిమా కథతో కొన్ని పాత్రలతో గంట పాటు సినిమాను తెరకెక్కించాడు. మూవీని ఎక్కడ బోర్ కొట్టించకుండా ట్విస్టులతో స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విజయం సాధించాడు. కేవలం ప్రేమే కాకుండా యాక్షన్, కామెడీని కూడా మేళవించి ఓ మంచి ఫీచర్ ఫిలిం ని చుసిన అనుభూతిని ఇవ్వడానికి తెర వెనుక, తెర ముందు అన్నీ తానై నడిపించాడు యువచంద్ర. దర్శకుడిగా, నటుడి(హీరో శ్రీకాంత్) గా రెండు వైపులా ప్రతిభను చాటుకొని ప్రశంసలు అందుకున్నాడు. హీరోయిన్ నిత్యా పాత్రలో శిల్ప రెడ్డి, యువచంద్ర కి మంచి సపోర్ట్ ఇచ్చింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ లవ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు. వీరికి విజయ్ కుమార్ కెమెరా పనితనం, సిద్దార్ధ్ ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ తోడవడంతో మంచి చిత్రాన్ని చూడగలిగామన్న సంతృప్తిని నెటిజనులకు ఇవ్వగలిగారు.