Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

నిహారిక కొణిదెల.. (Niharika) పరిచయం అవసరం లేని పేరు. మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి సొంతంగా గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసింది. చిరంజీవి ‘సైరా’ లో కూడా చిన్న పాత్ర పోషించింది. గత ఏడాది వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తాజాగా ఆమె తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చింది.

Niharika

నిహారిక (Niharika) మాట్లాడుతూ..”మా అన్నయ్య వరుణ్ తేజ్‌ కి కొడుకు పుట్టాడు.ఫ్యామిలీ అంతా ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాం. అప్పటి నుండి నేను కూడా చాలా బిజీ అయ్యాను. మా అల్లుడిని ఎత్తుకొని తిరగడంలో. లేదు అంటే.. ఇంట్లో నాకు ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. ‘అది తీసుకురా.. ఇది తీసుకురా.. నీళ్లు తీసుకురా’ అంటూ ఏదో ఒక పని చెబుతూనే ఉండేవారు.

కానీ మా అల్లుడిని ఎత్తుకుంటుంటే.. ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు(నవ్వుతూ). పెద్దయ్యాక వాడు(మా అల్లుడు) యాక్టర్ అవుతానంటే కచ్చితంగా నా బ్యానర్‌లోనే వాడిని యాక్టర్ ని చేస్తా. ఈ మధ్యనే మా బాబాయ్ ‘ఓజీ’ సినిమా రిలీజ్ అయ్యింది. మా ఇంట్లో వాళ్లందరికీ ‘ఓజీ’ ఫీవర్ పట్టుకుంది. మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉంది ఆ సినిమా” అంటూ చెప్పుకొచ్చారు నిహారిక (Niharika).

అలాగే ‘ప్రస్తుతం నేను మా ఫ్యామిలీతో కలిసి ఉండటం లేదు. కానీ 2 రోజులకు ఒకసారి వెళ్లి కలుస్తూనే ఉంటాను. నేను ఫ్యామిలీకి దూరం అవ్వలేదు. దూరంగా ఉంటున్నాను అంతే’ అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది ఈ మెగా డాటర్ (Niharika).

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus