హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో ఓ నటికి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సినీ నటి సోహానీ కుమారికి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. కొన్నాళ్ల క్రితం సవాయి సింగ్ అనే వ్యక్తిని ఈమె నిశ్చితార్థం చేసుకుంది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ ఫ్లాట్ లో వీరిద్దరూ కలిసుంటున్నారు.అయితే సోహానీ బయటకు వెళ్లి.. ఇంటికి రాగా… సవాయి సింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు.

Sohani Kumari

దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైంది సోహానీ. ఆ తర్వాత శోకసంద్రంలో మునిగిపోయింది. తర్వాత ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను ఓదార్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నాడట. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.’నేను చేసిన తప్పుల వల్లే నాకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి వచ్చింది’ అంటూ చెప్పి అతను ఉరేసుకున్నాడట.

గతంలో మరో అమ్మాయితో ఇతను ప్రేమాయణం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె వల్ల కూడా ఇతను మానసికంగా కృంగిపోయాడని. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఇతనికి ఎక్కువగానే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అలాగే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టి మరిన్ని వివరాలు తెలుసుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేశారు.

సోహానీ కుమారి హిందీ సీరియల్స్ తో పాపులర్ అయ్యింది.’యే హై చాహతే’ తో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది సోహానీ. ‘ప్యార్ టెస్టింగ్’ అనే వెబ్- సీరీస్ ను ఈమె నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus