చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నటి ఆవేదన!

  • January 4, 2022 / 06:45 PM IST

పాకిస్థానీలు తనని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ తెలిపింది. తన మాతృదేశమైన పాకిస్థాన్ నుంచే సోమీకి బెదిరింపు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది. చాలా రోజులుగా పాకిస్థాన్ నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్జీవో అని ఆమె పేర్కొంది.

సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికాకు వెళ్లిపోయిన సోమీ అలీ అక్కడ ఓ ఎన్జీవోను స్థాపించి హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురయ్యే బాధితులకు సాయం అందిస్తోంది. తన స్వచ్చంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితులను కాపాడుతూ ఉంటుంది సోమీ అలీ. ముఖ్యంగా గే విక్టిమ్స్ కు సోమీ చట్టపరమైన రక్షణ కల్పించడంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమని చెప్పుకొచ్చింది సోమీ. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ వస్తే చంపేస్తమానూ అక్కడ నుంచి మెయిల్స్ వస్తున్నాయని..

అందుకే తాను కొన్నేళ్లుగా పాకిస్థాన్ కు వెళ్లడం లేదని స్పష్టం చేసింది సోమీ అలీ. అక్కడికి వెళ్తే తనకు ప్రాణగండం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ కు చెందిన సోమీ అలీ.. అమెరికాలో సెటిల్ అయింది. ఆ తరువాత ముంబైకి వచ్చి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. అదే సమయంలో సల్మాన్ తో పదేళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అతడికి గుడ్ బై చెప్పేసి అమెరికాకు వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె సింగిల్ గానే ఉంటుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus