ప్రేమించడమే పెద్ద పొరపాటని బాధపడ్డ రెజీనా

ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో ఉండాలంటే ఆనపకాయంత శ్రమతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. హీరోయిన్ రెజీనా విషయంలో ఇది నిజమనిపిస్తోంది. ఈమె తెలుగులో “పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్, జ్యో అచ్యూతానంద” వంటి విజయాలు అందుకుంది. తమిళంలోనూ కేడి బిల్లా, కిల్లాడి రంగ, నెంజం మరప్పదిల్లై, జెమిని గణేశనుం సురుళిరాజనుం తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించి తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. టాప్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతూనే ఉంది. రీసెంట్ గా రెజీనా మీడియాతో తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకుంది.

“నటనా రంగంలో ఎంతో సాధించాలనే కోరికతో కెరీర్‌ను ప్రారంభించా. కాని.. నా జీవితంలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలో పడ్డ కారణంగా నా రూట్‌ మారింది. చేదు అనుభవాలతో మళ్లీ నన్ను నేను దిద్దుకున్నా. ప్రస్తుతం దాని నుంచి బయటకు వచ్చా.” అని వెల్లడించింది. ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పడానికి నిరాకరించింది. అయితే తన కోరిక నెరవేరేవరకు నటిస్తూనే ఉంటానని వెల్లడించింది. “నాకు పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. అయితే సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్న” అని రెజీనా వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus