నాకు పెళ్లి చేసుకోవాలనుంది

బాలీవుడ్‌ నటీమణుల్లో ఎక్కువగా విజయం సాధించిన వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఇటీవల ఆమె బాలీవుడ్‌ హీరోలకు దీటుగా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క నటి ప్రియాంక మాత్రమే. అంతేకాక భారత్‌లో మాత్రమే కాక, అమెరికాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ క్వాంటికో మూడో పార్ట్‌లో నటిస్తోంది. త్వరలోనే హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లోనూ ప్రియాంక షూటింగ్‌ను ప్రారంభించబోతుంది.

ఇటు బాలీవుడ్‌లోనూ.. అటు హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ భామ పెళ్లెప్పుడు చేసుకుంటుందా? అని ఆలోచించని వారుండరు. ఇంతకీ ఈ భామకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉందా? లేదా? అంటూ ఇటీవల ఢిల్లీ ఈవెంట్‌కు వచ్చిన ప్రియాంకకు పెళ్లి ముచ్చట్లు ఎదురయ్యాయి. ”కచ్చితంగా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇప్పటివరకు నేను చేసిన హార్డ్‌ వర్క్‌ను అభినందించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అమ్మ చెప్పింద’ని ప్రియాంక పేర్కొంది. కానీ తగిన అబ్బాయి దొరకడమే కష్టమైన పని అనిపిస్తుందంటూ నవ్వేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus