బాలీవుడ్ నటి నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నటుడుసూరజ్ పంచోలీ నిర్దోషి అంటూ.. ముంబయిలోని సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ విషయంలో జియా తల్లి రబియా ఖాన్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బిడ్డది ఆత్మహత్య కాదు, హత్య అని ఆమె మరోసారి తేల్చి చెప్పారు. అంతేకాదు తన బిడ్డకు న్యాయం జరిగే వరకు చెప్పారు. తన బిడ్డను సూరజ్ పంచోలీ ఆత్మహత్యకు ప్రేరేపించలేదని కోర్టు తేల్చిందని.. మరి నా బిడ్డ ఎలా చనిపోయిందని రబియా ఖాన్ ప్రశ్నించారు.
న్యాయస్థానం తీర్పు అన్యాయం కాదు, నేను షాక్ అవ్వలేదు. అయితే సీబీఐ ఈ పని చాలా కాలం క్రితమే చేసి ఉండాల్సింది. మొదటి రోజు నుండి, నేను తప్పుడు ఛార్జ్ అనే చెబుతున్నాను. ఈ కేసుకు ఆధారాలు లేవనే విషయం తేల్చడానికి సీబీఐకి 10 సంవత్సరాలు పట్టింది. అసలు ఆ అభియోగాలను మార్చి సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు పెట్టాలని నేను తొలుత ఉండి చెబుతున్నాను. అయితే ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పారామె.
అంతేకాదు ఈ కేసు విషయంలో నా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను అని చెప్పారు. ఎందుకంటే తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని ఆమె చెప్పారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. తన కూతుర్ని ఎవరు చంపారో కనుక్కోవడమే దర్యాప్తు సంస్థల పని అన్నారామె. తుది శ్వాస విడిచే వరకు తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తానని ఆమె మరోసారి తేల్చి చెప్పారు.
(Jiah ) జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరణానికి ముందు ఆమె ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసింది. సూరజ్‌తో సహజీవనంలో తలెత్తిన సమస్యలు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, తన కూతురు సూసైడ్ చేసుకునేలా సూరజ్ ప్రేరేపించాడంటూ జియా ఖాన్ తల్లి రబియా పోలీసులను ఆశ్రయించారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా