సినిమాలో ఎంత స్టఫ్ ఉన్నా, దర్శకుడిలో ఎంత టాలెంట్ ఉన్నా.. మనకు కావాల్సిన అంశం.. ఇంకా చెప్పాలంటే కీలకమైన అంశం హిట్. అవును సినిమా విజయం సాధిస్తే తర్వాత అవకాశాలు వస్తాయి, అలా చేసిన సినిమాలకు బజ్ కూడా వస్తుంది. అలాంటి బజ్‌ను తొలి సినిమాతో పొంది.. తర్వాతి సినిమాతో పోగొట్టుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో సంకల్ప్ రెడ్డి ఒకరు. ఆరేళ్ల క్రితం అంటే 2017లో ‘ఘాజీ’ అనే సినిమా తీసినప్పుడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి పేరు మారుమోగిపోయింది.
ఆ తర్వాత ‘అంతరిక్షం’ అంటూ వచ్చినా.. సరైన విజయం అందుకోలేకపోయారు. (Sankalp) ఆ దర్శకుడి నెక్స్ట్ సినిమా గురించే ఇప్పుడు చర్చ. తక్కువ బడ్జెట్‌లో గ్రాండియర్‌గా ‘ఘాజీ’ తెరకెక్కించి వావ్ అనిపించారు సంకల్ప్ రెడ్డి. ఇంచుమించు అలాగే తీసిన ‘అంతరిక్షం’ మన జనాలకు కనెక్ట్ అవ్వలేదు. దీంతో తర్వాతి సినిమా ఏం చేస్తారు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్‌కి వెళ్లిపోయారు సంకల్ప్ రెడ్డి.
విద్యుత్ జమ్వాల్ హీరోగా ‘ఐబీ 71’ అనే సినిమా అనౌన్స్ చేశారు 1971లో పాకిస్థాన్ యుద్ధ ప్రణాళికలను ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ దేవ్ ఏం చేశాడు అనేదే కథ. క్లియర్‌గా చెప్పాలంటే ‘ఘాజీ’ సినిమాకు ముందు ఏం జరిగిందనేదే ‘ఐబీ 71’ కథ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత సినిమా ప్రభావమో ఏమో.. ఈ సినిమాకు సరైన బజ్ దొరకలేదు. దీంతో ఓపెనింగ్స్ డల్‌గా ఉన్నాయి అని అంటున్నారు.
సోమవారానికి కూడా సినిమా వసూళ్లు ఊపందుకోలేదు. దీనికి కారణం సినిమాలో ఎక్కువ సమాచారం ఇచ్చే క్రమంలో కొన్ని చోట్ల అనవసరమైన కన్‌ఫ్యూజన్ వచ్చింది అంటున్నారు. దీంతో సంకల్ప్ రెడ్డి మరోసారి ఆశించిన మేర విజయం అందుకోలేకపోయారు అని చెప్పొచ్చు. మరోవైపు సంకల్ప్ తర్వాతి సినిమా ఏంటి అనే విషయంలోనూ క్లారిటీ లేదు. తెలుగులో చేస్తారా? హిందీలోనే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!