Allu Arjun: ఫ్యామిలీతో లండన్ టూర్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఎలాంటి సినిమా షూటింగ్ లు లేకపోవడంతో తన కుటుంబంతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్ళినట్లు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో ఏ మాత్రం తనకు విరామం దొరికిన అల్లు అర్జున్ ఎక్కువగా తన కుటుంబంతో సమయం కేటాయించడానికి ఇష్టపడతారు.

ఈ క్రమంలోనే తరచూ తన భార్య పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లడం లేదా ఇతర దేశాలకు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పుష్ప 2సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి లండన్ టూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లండన్ లో పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేస్తూ లండన్ అందాలను ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఫోటోలను నిత్యం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

ముఖ్యంగా స్నేహ రెడ్డి తన పిల్లలు అర్హ, అయాన్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కావడంతో పెద్దఎత్తున నెటిజన్లు లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం వీరి లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ లండన్ వెకేషన్ భారీగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లుఅర్జున్ ఇప్పటికే పుష్ప 2సినిమాతో బిజీ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

1

2

3

4

5

6

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus