Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • నిత్యామీనన్ (Heroine)
  • రాజ్ కిరణ్, సత్యరాజ్, అరుణ్ విజయ్, శాలిని పాండే (Cast)
  • ధనుష్ (Director)
  • రామారావు చింతలపల్లి (Producer)
  • జి.వి.ప్రకాష్ కుమార్ (Music)
  • కిరణ్ కౌశిక్ (Cinematography)
  • ప్రసన్న జి.కె (Editor)
  • Release Date : అక్టోబర్ 01, 2025
  • ఎస్వీఎం ప్రొడక్షన్ (Banner)

ధనుష్ (Dhanush) దర్శకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం “ఇడ్లీ కొట్టు”. సింపుల్ & ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హడావుడి ఏమీ లేకుండా బుధవారం (అక్టోబర్ 1) విడుదలైంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కానీ, పాటలు కానీ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. మరి దర్శకుడిగా ధనుష్ మరోసారి తన సత్తాను చాటుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

Idli Kottu Movie Review

కథ: తండ్రి శివకేశవ (రాజ్ కిరణ్) ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఇడ్లీ కొట్టుని కాదనుకొని పెద్ద ఉద్యోగం, డబ్బు కోసం సొంత ఊరు విడిచి వెళ్లిపోతాడు మురళి (ధనుష్) (Dhanush). AFC అనే సంస్థకు వర్క్ చేస్తూ లక్షల సంపాదన ఉన్నా.. ఎందుకనో సంతోషంగా ఉండదు. AFC కంపెనీ హెడ్ కూతురు (శాలిని పాండే)ను పెళ్లి చేసుకొని బ్యాంకాక్ లో ఉండిపోవడానికి సిద్ధమైన తరుణంలో.. తండ్రి మరణం మురళిని మళ్లీ సొంత ఊరికి రప్పిస్తుంది.

ఏళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చిన మురళికి ఎదురైన అనుభవాలు ఏమిటి? తండ్రి గుర్తుగా మిగిలిన ఇడ్లీ కొట్టుకు ఏం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఇడ్లీ కొట్టు” కథాంశం.

నటీనటుల పనితీరు: అరుణ్ విజయ్, శాలిని పాండే తప్ప అందరూ చక్కని నటన కనబరిచారు. వాళ్లిద్దరి పాత్రలు కానీ, నటన కానీ, లుక్ కానీ సినిమాకి ఎందుకో సింక్ అవ్వలేదు. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన గీతా కైలాసం నటన చూసి కళ్లు చెమర్చడం ఖాయం. ఆ పాత్రను ధనుష్ (Dhanush) డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది.

రాజ్ కిరణ్ స్క్రీన్ ప్రెజన్స్ తోనే మ్యాజిక్ చేశారు. ఆయన నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమా మొత్తం ఆయన కనిపిస్తూనే ఉంటారు.

ధనుష్ & నిత్యామీనన్ ఎప్పట్లానే సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

సత్యరాజ్ మరో కీలకపాత్రలో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా ఆవు దూడ సీక్వెన్స్ ను డిజైన్ చేసిన విధానం కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాగ్జిమం ఎఫర్ట్స్ పెట్టారు కానీ.. సెట్ అని తెలియకుండా చేయలేకపోయారు. ఆ రోడ్డు కానీ, చుట్టుపక్కల పరిసరాలు కానీ చాలా అసహజంగా ఉంటాయి.

జీవి ప్రకాష్ కుమార్ పాటలు సపరేట్ గా వింటే పెద్దగా ఎక్కవు కానీ.. సినిమాలోని ఎమోషన్ కి ఆ పాటలు ప్రాణం పోసాయని చెప్పాలి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని తీసుకెళ్లి పల్లెటూర్లో కూర్చేబెట్టేసింది.

తెలుగు డైలాగ్ రైటర్ పనితనాన్ని కూడా మెచ్చుకోవాలి. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా, కొన్నిసార్లు ప్రేక్షకుల ఫీల్ అయ్యే మాటల్ని కూడా సహాయ పాత్రల ద్వారా చెప్పించడం అనేది సినిమాకి ప్లస్ అయ్యింది.

ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ & మైనస్ పాయింట్ రెండూ ధనుష్ అనే చెప్పాలి. ఒక దర్శకుడిగా అతడి ప్రతిభను మెచ్చుకునే అంశాలు చాలా ఉన్నప్పటికీ.. ఒక రచయితగా మాత్రం అలరించలేకపోతున్నాడు. “ఇడ్లీ కొట్టు” సినిమాలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు, సందర్భాలు, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అయితే.. వాటన్నిటినీ ఒడిసిపట్టుకునే స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకుండాపోయింది. అసలు ధనుష్ పాత్ర ఎందుకని తల్లిదండ్రులకు దూరంగా ఉంది, ఎందుకని తండ్రి అతడ్ని క్షమించలేకపోతున్నాడు, సత్యరాజ్ క్యారెక్టర్ & అరుణ్ విజయ్ క్యారెక్టర్ లో ఉన్న గ్రే షేడ్ ఏంటి వంటివేమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల.. కొన్ని సన్నివేశాలు చూసి ఎంత అనుభూతి చెందినా.. చివరివరకు కూర్చోబెట్టే ఎమోషన్స్ మాత్రం లేకుండాపోయాయి. అందువల్ల.. దర్శకుడిగా ఆకట్టుకున్న ధనుష్, కథకుడిగా అలరించలేక ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టలేకపోయాడు.

విశ్లేషణ: ఎమోషనల్ సినిమాల్లో సెంటిమెంట్ అనేది గుండె అయితే.. ఆ సెంటిమెంట్ ను హోల్డ్ చేసే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఊపిరితిత్తులు లాంటివి. గాలి ఆడకుండా గుండె కొట్టుకోదు కదా. “ఇడ్లీ కొట్టు” విషయంలో జరిగింది అదే. కచ్చితంగా ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించే ఎమోషనల్ సీన్స్ కనీసం 10 ఉన్నాయి. కానీ.. చాలా విషయాలకి సరైన జస్టిఫికేషన్ లేక సినిమా సంతృప్తినివ్వలేక చతికిలపడింది.

ఫోకస్ పాయింట్: ఇడ్లీ పిండిలో నూక తక్కువైంది ధనుష్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus