చిరు ‘ఉ..’ అంటే చాలు – దాసరి కిరణ్ కుమార్

మెగాస్టార్ చిరంజీవికి ఇంటా – బయటా (పరిశ్రమలో, బయట) బోలెడుమంది అభిమానులు. చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన్ని తెరపై చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానులు ఎంతమందున్నారో, అదే స్థాయిలో ఆయనతో ఓ సినిమా చేయాలని పరిశ్రమలోని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా ఓ నిర్మాత చిరు ‘ఉ..’ అంటే చాలు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానని ప్రకటించారు.
హావీష్ హీరోగా రామ్ లీల, జీనియస్ చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ బుల్లితెర నటుడు సాగర్ హీరోగా ‘సిద్ధార్థ’ అనే సినిమాని నిర్మించారు.

ఈ నెల 16న సినిమా విడుదలవుతోన్న సందర్బంగా పత్రికల వారితో ముచ్చటిస్తూ తన తర్వాతి సినిమాలు స్టార్ హీరోలతో చేయాలనుకుంటున్నట్టు తెలిపారు అన్నిటికీ మించి ‘చిరు’ అవకాశమిస్తే.. ఆయనతో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ సినిమా చేయాలనుంది తన కోరిక బయటపెట్టారు. అందుకు పరచూరి సోదరుల వద్ద కథ సిద్ధంగా ఉందన్నారు. ‘సిద్దార్థ’ సినిమాకి కలం కదిలించిన పరచూరి సోదరులతో కిరణ్ మంచి అనుబంధమే ఏర్పరచుకున్నారు గానీ అవతల చిరు కోసం దిల్ రాజు లాంటి నిర్మాతలు లైన్లో ఉన్నారు మరి. ఈ వ్యవహారం ‘ఉ’, ‘ఉహు’లతో తేలుతుందనుకోవడం ఒట్టిమాటే. పోతే.. ‘సిద్దార్థ’లో హీరోగా నటించిన సాగర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చెబుతూ షారుక్ ఖాన్ కూడా బుల్లితెరపై నుండి వచ్చినవారే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నట్టు ప్రస్తుతం ఈయన వర్మ తెరకెక్కిస్తోన్న వంగవీటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus