Samantha: ఈ ఆహ్వానం అందుకోవడం గర్వంగా ఉంది: సమంత

  • July 19, 2022 / 08:07 PM IST

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర ద్వారా నార్త్ ప్రేక్షకులను సైతం పెద్ద ఎత్తున సందడి చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ప్రేక్షకాభిమానులు అయ్యారు.ఇలా నార్త్ సౌత్ ఇండస్ట్రీలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా మరోసారి నార్త్ ప్రేక్షకులను సందడి చేసిన సమంతకు ఏకంగా బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫెస్టివల్ అవార్డుల వేడుకలో పాల్గొనడం కోసం సమంతకు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో జరిగే ఈ వేడుకలు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించడంతో సమంత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఆగిపోయిన ఈ వేడుకలు తిరిగి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్నాయి. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల కోసం సమంతకు ఆహ్వానం రావడంతో సమంత ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా సమంత ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతేడాది ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM) భాగమయ్యాను.

ఇక ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ వేడుక కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఒకచోట చేరడం అనేది గొప్ప అనుభూతి అంటూ ఈ సందర్భంగా సమంత తెలియజేశారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus